కాల గర్భం లోకి రోజులు జారిపోతున్నాయి
కొన్ని రోజులు నిర్లిప్తంగాను, కొన్ని రోజులు నిరాశతోను
కొన్ని రోజులు ఆనందంగానూ, కొన్ని రోజులు ఆశ్చర్యంతోను
కొన్ని రోజులు గెలుపిచ్చే తృప్తి తోను
కొన్ని రోజులు ఓటమిచ్చే నొప్పి తోను
ఎందుకని మనిషి నిరంతరం ఆనందంగా ఉండలేకపోతున్నాడు??
సమస్య అంతా మనిషి మనసులో పుట్టింది...
"ఉన్నది సరిపోదు" అనే ఆలోచన ఆశలా కనిపిస్తున్నా
అదే మనల్ని ఈ నిరాస వైపు నడిపిస్తోంది
ఏదో సాధించాలని మనిషి ఈ ప్రయత్నంలో అసలు గమ్యం మర్చిపోతున్నాడు
శాశ్వత ఆనందమే తన సహజ స్థితి
ఇప్పుడు తన సహజ స్థితే తన గమ్యం..ఎంత విచిత్రం!!
తన సహజ స్థితే తన గమ్యంగా మార్చుకున్న మనిషి
యుగ యుగాలుగా ఏం ఎదిగినట్టు?
జీవితం లో ఎదురయ్యే...
ప్రతి అనుభూతిని ఆస్వాదిస్తూ
ప్రతి భావోద్వేగాన్ని ఆనందిస్తూ
ప్రతి మనిషిని అభిమానిస్తూ
బ్రతకడం మానేసి జీవిస్తూ
జీవిత పరమావధి వైపు అడుగులెయ్యలి!!
-హేమంత్ విహరి.కే