నువ్వు ఎంచుకుంటే మౌనం
నీకై తపించిపోదా ప్రాణం
నువ్వు లేని ఏ ఒక్క క్షణం
నాకది చీకటి నిండిన ఒంటరితనం
నీకై తపించిపోదా ప్రాణం
నువ్వు లేని ఏ ఒక్క క్షణం
నాకది చీకటి నిండిన ఒంటరితనం
నీకు దూరంగా వెళ్ళలేను
నిన్ను దూరంగా పెట్టలేను
నీ చెంత తప్ప ఇంకెక్కడా లేను
నువ్వేక్కడుంటే అక్కడే నేను
ఎందుకు మనల్ని కలిపిందంటే
బదులేమిస్తుందో అభిమానం
నిలవని సంద్రపు నీటికి తీరం నువ్వు
గడవని చీకటి రాత్రికి ఉదయం నువ్వు
-హేమంత్ విహరి.కే